Kitchenvantalu

Mushroom Fried Rice:మష్రూమ్స్ తో రుచికరమైన ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

Mushroom Fried Rice:మష్రూమ్స్ తో రుచికరమైన ఫ్రైడ్ రైస్ తయారీ విధానం.. మష్రూమ్స్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఫ్రైడ్ రైస్ గా చేసుకుంటే మష్రూమ్ అంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్దాలు
మష్రుమ్స్ – 200 గ్రాములు
ఉల్లి కాడల తురుము – ఒక కప్పు
బాస్మతి బియ్యం – పావు కిలో
మిరియాల పొడి – ఒక స్పూన్
పచ్చిమిర్చి తురుము – పావు కప్పు
ఉప్పు – తగినంత
నూనె – 5 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర – ఒక కట్ట
చైనీస్ సాల్ట్ – చిటికెడు

తయారీ విధానం
ముందుగా బియ్యం కడిగి అన్నం ఉడికించి పక్కన పెట్టాలి. మష్రుమ్స్ ని సగానికి కోసి ఉడికించాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తురుము వేసి వేగించాలి. అవి వేగిన తర్వాత ఉల్లి కాడల తురుము,మిరియాల పొడి వేయాలి.

ఇవి కొంచెం వేగాక ఉడికించిన మష్రుమ్స్ వేయాలి. అవి వేగాక అన్నం వేసి తగినంత ఉప్పు,చైనీస్ సాల్ట్ వేసి కలిపి,చివరగా కొత్తిమీర చల్లి వడ్డించాలి. అంతే మష్రుమ్ ఫ్రైడ్ రైస్ రెడీ…

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."