Healthhealth tips in telugu

Erra Thotakura Benefits: ఎర్రతోట కూరలో ఇన్ని ప్రయోజనాలా.. అస్సలు మిస్ చేసుకోకండి!!

Erra Thotakura Benefits: తోటకూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా మనం చూసే తోటకూర ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే ఆకుకూర ఎర్ర తోటకూర. ఈ మధ్య కాలంలో చాలా విరివిగానే లభ్యమవుతుంది. ఈ ఆకుకూరలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఈ తోటకూర ఆకులన్నీ చూడటానికి ఎర్రగా ఉంటాయి.

ఎర్ర తోటకూర తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు విషయానికి వచ్చేసరికి దీనిలో విటమిన్ బి, సి, కే సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఎర్ర తోటకూరను పవర్ హౌస్ గా చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాధికల్స్ తో పోరాటం చేసి మొత్తం ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

ఈ ఆకుకూరను తినటం వల్ల బరువు కూడా చాలా సులభంగా తగ్గవచ్చు. బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి ఎర్ర తోటకూర మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఆకుకూర చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆకుకూరలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తినాలనే కోరికను తగ్గిస్తుంది. జంక్ ఫుడ్ తీసుకునే కోరికను కూడా తగ్గిస్తుంది.

జీర్ణ ప్రక్రియకు బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే సమస్యలకు చెక్ పెడుతుంది.

దీనిలో Calcium సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారటానికి కూడా సహాయపడుతుంది. ఈ ఆకుకూర 365 రోజులు లభ్యమవుతుంది. కాబట్టి వారంలో కనీసం రెండుసార్లు ఈ ఆకుకూరను తీసుకొని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."