Health Juice:వయసు 40 దాటినా ముఖంపై ముడతలు ఉండకూడదా? మోదీ, సద్గురు తాగే ఈ ‘ఆకు రసం’ గురించి తెలిస్తే ఇప్పుడే తాగుతారు!
Health Juice:వయసు 40 దాటినా ముఖంపై ముడతలు ఉండకూడదా? మోదీ, సద్గురు తాగే ఈ ‘ఆకు రసం’ గురించి తెలిస్తే ఇప్పుడే తాగుతారు.. వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలని ఎవరికి ఉండదు? కానీ కాలుష్యం, ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, జుట్టు రాలడం, బీపీ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం.. “మునగాకు రసం (Moringa Juice)”.
స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా ఈ మునగ ఆకులను తమ ఆహారంలో భాగం చేసుకుంటారని మీకు తెలుసా? దీనిని ఆయుర్వేదంలో ఒక సంజీవనిగా చెబుతారు. రాంచీకి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ వి.కె. పాండే దీని అద్భుత ప్రయోజనాలను ఇలా వివరించారు.
ALSO READ:పాదాలు పగిలి నడవలేకపోతున్నారా? రాత్రి పడుకునే ముందు ఈ 5 రూపాయల చిట్కా పాటించండి.. ఉదయానికి పాదాలు మెత్తగా మారుతాయి!
1. యాంటీ ఏజింగ్ (Anti-Aging Secret): మునగలో విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. చర్మానికి కొత్త మెరుపును తెచ్చి, వయసు పెరిగినా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
2. జుట్టు సమస్యలకు చెక్: మీరు జుట్టు రాలడం లేదా చిన్న వయసులోనే తెల్ల జుట్టు (Grey Hair) సమస్యతో బాధపడుతున్నారా? అయితే మునగ రసం మీకు దివ్యౌషధం. ఇందులో ఉండే ఐరన్, విటమిన్-A జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
3. బీపీ పేషెంట్లకు వరం: అధిక రక్తపోటు (High BP) ఉన్నవారికి ఇది నిజంగా అద్భుతం. డాక్టర్ పాండే ప్రకారం.. మీ బీపీ 200 ఉన్నా సరే, వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ రసం తాగితే అది 140-150కి తగ్గుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది.
4. రోగనిరోధక శక్తి & జీర్ణక్రియ: తరచుగా జలుబు, జ్వరం బారిన పడేవారికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పరార్ అవుతాయి.
ఎలా తాగాలి? లేత మునగ ఆకులను గ్రైండ్ చేసి రసం తీయాలి. ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో ఈ రసం కలుపుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా దీన్ని తాగవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

