పాపం సునీల్ పరిస్థితి ఇలా అయిందే…ఇలా అయినా సక్సెస్ అవుతాడా….???
హీరోగా మారి పలు చిత్రాల్లో నటించిన సునీల్ తర్వాత వరుస పరాజయాలు అందుకున్నాడు. అయితే కమెడియన్ గా స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న సునీల్ మళ్ళీ కొన్ని సినిమాల్లో కమెడియన్ గా టర్న్ అయ్యాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో పెద్ద సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్న సునీల్ మరోసారి కెరీర్ లో టర్న్ అవ్వబోతున్నాడు. పైగా అది విలన్ పాత్ర అంటున్నారు. అవును, మొదట సారి సునీల్ విలన్ పాత్రను చేసేందుకు సిద్దం అయ్యాడు. కమెడియన్ గా హీరోగా మెప్పించిన సునీల్ విలన్ గా ఏ స్థాయిలో మెప్పించనున్నాడో చూడాలి.
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట చిత్రాల మేకర్ అయిన సాయి రాజేష్ నిర్మాణంలో సందీప్ రాజ్ దర్శకత్వంలో సుహాస్ , చాందిని చౌదరి జంటగా రూపొందుతున్న ‘కలర్ ఫొటో’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఆవిష్కరించారు. నాని ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ, ఈ చిత్రంలో నటించబోతున్నందుకు చాలా ఎగ్జైట్ గా ఉన్నా’ అంటూ సునీల్ ట్వీట్ చేశాడు.ఇప్పటి వరకు కామెడీ చేసి నవ్వించిన వారు చాలా మంది విలన్స్ గా మారి భయపెట్టారు.
అందుకే సునీల్ విలన్ గా కూడా తప్పకుండా మెప్పిస్తాడనే నమ్మకం అందరిలో ఉంది. నిర్మాత సాయి రాజేష్ విభిన్నమైన కాన్సెప్ట్ లు తీసుకుని హృదయ కాలేయం మరియు కొబ్బరిమట్ట చిత్రాలు తెరకెక్కించాడు. ఈసారి మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో వేగంగా చిత్రీకరణ చేసి ,విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. మరి విలన్ గా చేస్తున్న ప్రయత్నంలో సునీల్ ఈమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
