Movies

అల్లు అర్జున్ పెళ్ళికి తల్లి పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా?

గంగోత్రి మూవీ ద్వారా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి,అంచెలంచెలుగా ఎదుగుతూ స్టైలిష్ స్టార్ గా స్టార్ హీరో స్టేటస్ తెచ్చుకున్న అల్లు అర్జున్ లవ్ మేరేజ్ చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే ఇందుకు బన్నీ డాడ్ అల్లు అరవింద్.. మదర్ నిర్మల ఒప్పుకున్నారా.. అంటే.. పూర్తిగా ఎవరికీ తెలీదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ హాట్ టాపిక్ అయింది కూడా. హైదరాబాద్ కి అప్పట్లోచెందిన బిజినెస్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లాడాడు. ఆ క్రమంలోనే దీనిపై రకరకాల గుసగుసలు వినిపించాయి. అయితే అభిమానులు పూర్తిగా బన్నీ నిర్ణయాన్ని సమర్థించారు.

అయితే ఈ మేరేజ్ విషయంలో పేరెంట్స్ ఏమన్నారో చూద్దాం. అసలు స్నేహారెడ్డిని పెళ్లాడతాను అని బన్ని మొదట తన తల్లి నిర్మలతోనే చెప్పారట. “నువ్వు చేసుకున్నా.. మేం వేరే అమ్మాయిని చూసి చేసినా నువ్వు హ్యాపీగా ఉండడమే ముఖ్యం. నువ్వు హ్యాపీగా ఉంటే మేం హ్యాపీ“ అని బన్ని తల్లి అన్నారట. మరి అరవింద్ విషయానికి వస్తే, అర్జున్ ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ విషయం ఇంట్లో అయిదు నిమిషాల్లోనే సెటిల్ చేశాం. ముందు స్నేహ విషయం బన్ని తన అమ్మ దగ్గరే చెప్పాడు… అని అసలు సంగతి చెప్పారు.

పెళ్లి,రిసెప్షన్ గ్రాండ్ గా జరిగిఇపోయాయి. ఇక బన్ని- స్నేహా జంటకు మాస్టార్ అయాన్.. బేబి అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు వడి వడిగానే ఎదిగేస్తున్నారు. తీరిక సమయాల్లో తాతయ్యను, డాడ్ ని చిన్నారి అర్హ ఆట పట్టించే ఫోటోలు ఇప్పటికే నెట్ లో వైరల్ అయ్యాయి. అలాగే టాలీవుడ్ ఆదర్శ జంటగానూ బన్ని- స్నేహా జోడీ పాపులరయ్యారు. ప్రేమ పెళ్లిని సక్సెస్ చేసుకున్న బెస్ట్ హీరోగా బన్నీపై అభిమానుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. మొత్తానికి పెద్దలను ఒప్పించి చేసుకున్న ఈ పెళ్లి మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.