మాటల మాంత్రికుని బెస్ట్ మూవీస్…మీరు చూసారా…?

Tollywood director trivikram srinivas :రచయితగా ఇండస్ట్రీకి వచ్చి, డైరెక్టర్ గా రాణిస్తూ,స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్ లో చాలామంది హీరోలతో చేసారు. అందులో బెస్ట్ మూవీస్ గా చెప్పుకోదగ్గ చిత్రాలు ఎక్కువే ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే, కేవలం కథ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించగా, కె విజయభాస్కర్ డైరెక్ట్ చేసిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది.

త్రివిక్రమ్ మాటలు అదిరిపోయాయి. ఇక తరుణ్ తో తీసిన నువ్వే నువ్వే. ఈ మూవీ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన తొలిమూవీ. 2002లో వచ్చిన ఈ మూవీకి కోటి సంగీతం అందించగా, హీరోయిన్ గా శ్రేయ నటించింది. కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది.ఇక రిలీజ్ కి ముందే నెట్ లో సగం మూవీ లీకైనప్పటికీ థియేటర్ల దగ్గర మళ్ళీ జనం రద్దీ పెంచేసిన సినిమా అత్తారింటికి దారేది. ఇందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా,అందుకు తగ్గ కథతో ఎమోషనల్ గా తెరకెక్కించిన త్రివిక్రమ్ మరో కారణం.

సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా అత్త పాత్రతో మెప్పించింది. 2013లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సూపర్భ్. గత 2020 సంక్రాంతికి వచ్చిన అలవైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బన్నీ హీరోగా చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. థమన్ మ్యూజిక్ అదిరి పోయింది. త్రివిక్రమ్ కెరీర్ లో మరువలేని మూవీగా నిల్చింది. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఫ్యాక్షన్ నేపథ్యంతో తీసినప్పటికీ కొత్తకోణం చూపించాడు.

2018లో వచ్చిన ఈ మూవీకి థమన్ బాణీలు అందించాడు. పూజా హెగ్డే,ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్,బన్నీతో అంతకు ముందు తీసిన సినిమా జులాయి. సరికొత్త కథతో తీసిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన అతడు మూవీ. ప్రొఫెషనల్ కిల్లర్ గా మహేష్ ని చూపిస్తూ, కామెడీ,ఎమోషన్ పండించిన ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ సరేసరి. త్రిష హీరోయిన్. నాజర్ కీలక రోల్ పోషించాడు.2005లో వచ్చిన ఈ మూవీకి మణిశర్మ చక్కటి బాణీలు అందించాడు.

యంగ్ హీరో నితిన్ తో సమంత హీరోయిన్ గా క్యూట్ లవ్ స్టోరీతో తీసిన సినిమా అ ఆ. అనుపమ పరమేశ్వరన్ సెకండ్ హీరోయిన్ గా చేసి, అలరించింది. 2016లో రిలీజైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయాన్ని ఆడుకుంది. ఇక బన్నీతో త్రివిక్రమ్ తీసిన సన్నాఫ్ సత్యమూర్తి కూడా మంచి విజయాన్ని అందుకుంది.

జులాయి తర్వాత వీరి కాంబోలో వచ్చిన రెండవ సినిమా ఇది. 2015లో వచ్చిన ఈ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించాడు. సమంత హీరోయిన్. నిత్యా మీనన్ కూడా కీలక భూమిక వహించింది. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ కి మంచి హిట్ ఇచ్చిన మూవీ జల్సా. కామెడీ,ఎమోషన్ కలగలసిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ అద్భుత బాణీలు అందించారు. ఆడియో సిడిల ద్వారా కోటి రూపాయలు తెచ్చిన తొలి సినిమా యే కాదు, మొదటివారంలో 20కోట్ల షేర్ రాబట్టిన తొలిసినిమా కూడా. ఇలియానా హీరోయిన్ గా చేసింది.