Kitchenvantalu

Kakarakaya Varugulu:సంవత్సరం పాటు నిల్వ ఉండే కాకరకాయ ఒరుగులు.. సులభంగా పెట్టేయండి

Kakarakaya Varugulu:రుచి కి చేదేకాని ఆరోగ్యానికి మాత్రం చాల మేలు. కాకరకాయ వారంలో ఒకసారైన తినాల్సిందే. ఫ్రై ,పులుసు,ఇగురు కాకుండా కాకరకాయ చిప్స్ తయారు చేసి పెట్టుకోండి.

కావాల్సిన పదార్ధాలు
కాకరకాయలు – 1 kg

తయారీ విధానం
1.కాకరకాయలను కొనలు కత్తిరించి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.కత్తిరిచ్చచుకున్న ముక్కలను ప్లేట్ లో విడి విడిగా ఆరబెట్టుకోని రెండు ,మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలి.
3.ముక్కలు ఎండుతున్నా కొద్ది సైజ్ తగ్గిపోయి అందులోని తడి ఎండిపోతుంది.
4.పూర్తిగా పచ్చిదనం పోయి..ఎండిపోయి తేలికగా తయారైన కాకరకాయ ముక్కలను స్టోర్ చేసి పెట్టుకోవాలి.
5.తినాలి అనుకున్నప్పుడు కడాయిలో నూనెపోసి ,వడియాల మాదిరిగా వేపుకోని..అందులోకి ఉప్పు,కారం,తురుమిన వెల్లుల్లి కల్పుకోని సైడ్ డిష్ గాను వాడుకోవచ్చు.
Click Here To Follow Chaipakodi On Google News