Kitchenvantalu

Moong Dal Nuggets:పెసరపప్పు నగ్గెట్స్.. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

Moong Dal Nuggets:ప్రోటీన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు చెప్పే స్నాక్ సాయంత్రం సమయంలో తినటానికి బాగుంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్ధాలు
1/2 కప్పు పచ్చి శనగపప్పు
1/2 కప్పు ఆకుపచ్చని పెసరపప్పు
ఉప్పు రుచికి సరిపడా
1/2 ఉల్లిపాయ
2 పచ్చిమిర్చి
1/4 కప్పు క్యారెట్
6-7 కరివేపాకు
1 కప్పు బ్రెడ్ ముక్కలు
1/2 స్పూన్ ఎర్ర మిరప పొడి
1/4 స్పూన్ బ్లాక్ పెప్పర్
1/2 టీస్పూన్ చాట్ మసాలా
1/2 టీస్పూన్ జీలకర్ర
2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్
2 స్పూన్ నూనె

తయారి విధానం
ఆకుపచ్చని పెసరపప్పు, పచ్చి శనగపప్పులను ఒక గిన్నెలోకి తీసుకోని శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ పప్పులను మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడికించాలి. రెండు స్పూన్ల పప్పును పక్కన పెట్టాలి.

మిగిలిన పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.ఒక గిన్నెలో రుబ్బిన పప్పును తీసి.. దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్,కరివేపాకు,కారం,మిరియాల పొడి,చాట్ మసాలా,జీలకర్ర, బ్రెడ్ ముక్కలు మరియు కార్న్‌ఫ్లోర్ వేసి పిండిని బాగా కలపాలి.

ఈ మిశ్రమం నుండి చిన్న నగ్గెట్‌లను తయారు చేయండి. air fryer ను 180 డిగ్రీల వద్ద వేడి చేయండి. అన్ని నగ్గెట్‌లను ఒక బుట్టలో వేసి, వాటిని నూనెతో బ్రష్ చేసి 15 నిమిషాలు కాల్చండి. లేదా క్రిస్పీ గోల్డెన్‌గా మారనివ్వండి. కావాలంటే నూనెలో కూడా వేయించుకోవచ్చు.