Healthhealth tips in telugu

గ్యాస్, ఎసిడిటీ మాయం: ఉదయాన్నే పరగడుపున ఇది తీసుకుంటే చాలు!

Dhaniyalu Gas problem Home Remedies In telugu : ఉదయాన్నే లేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా ఎసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ బ్లాగ్ పోస్ట్ మీ కోసమే! ఉదయం పరగడుపున ఒక చిన్న ఆహారపు అలవాటును మార్చుకోవడం ద్వారా మీ పొట్టను ఎలా శుభ్రం చేసుకోవచ్చో, జీర్ణ సమస్యలను శాశ్వతంగా ఎలా దూరం చేసుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

బిజీ జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోకపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణ సంబంద సమస్యలు అయిన గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.
Acidity home remedies
ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం. ఒక స్పూన్ ధనియాలను వేగించాలి. వేగిన ధనియాలు, చిన్న అల్లం ముక్కను కొంచెం నీటిని పోసి పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసంలో అరస్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం వేడి చేసుకొని తాగాలి.

ఈ విధంగా 3 రోజులు తాగితే జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటివి అన్నీ తొలగిపోయి ప్రశాంతగా ఉంటుంది. జీర్ణ సంబంద సమస్యలను అశ్రద్ద చేస్తే పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి.

ధనియాలు,అల్లం వంటింటిలో అందుబాటులో ఉంటుంది. మనం ప్రతి రోజు ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం. తేనె ఆర్గానిక్ తేనె అయితే మంచిది. ధనియాలు,అల్లం జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."