కేవలం 30 రోజుల్లో షుగర్, కొలెస్ట్రాల్, బరువుకు చెక్ పెట్టే అద్భుత పానీయం!
Munagaku uses in telugu : డయాబెటిస్, కొలెస్ట్రాల్, అధిక బరువు… ఈ సమస్యలన్నింటికీ వేర్వేరు మందులు వాడి విసిగిపోయారా? అయితే కేవలం 30 రోజుల్లో ఈ సమస్యలన్నింటినీ సహజంగా తగ్గించే ఒక అద్భుతమైన డ్రింక్ గురించి మీకు తెలుసా?
ఈ మ్యాజిక్ డ్రింక్ ఎలా తయారు చేయాలి, దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ కంటి చూపు ఎలా మెరుగుపడుతుందో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి. మీ ఆరోగ్యాన్ని మార్చేసే అద్భుతమైన చిట్కా!
మునగలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగకాడలే కాదు, ఆకుల వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. మునగ ఆకులు అధిక బరువును తగ్గించి, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

నిమ్మ జాతి పండ్ల కంటే మునగాకులో విటమిన్ సి ఏడు రెట్లు అధికంగా ఉంటుంది. పొటాషియం అరటి పళ్లలో కంటే 15 రెట్లు ఎక్కువగా ఈ ఆకులో ఉంటాయి. ప్రొటీన్లు, విటమిన్ ఎ, కాల్షియం కూడా మునగాకుల్లో విరివిగా లభిస్తాయి. శరీరంలో విషాలను తొలగిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి జీవక్రియలను ఉత్తేజితం చేస్తుంది. కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.
డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేసి డయబెటిస్ అంటే షుగర్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ చర్యలను అదుపులో ఉంచుతుంది.
ఒక కప్పు నీటిలో పావు కప్పు మునగ ఆకులు వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసి రసాన్ని తీసుకోవాలి. ఈ రసంలో అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని రాత్రి లేదా సాయంత్రం సమయంలో తాగాలి. ఈ విధంగా 30 రోజుల పాటు తాగితే అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

