MoviesTollywood news in telugu

మెగాస్టార్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘హిట్లర్’: తెరవెనుక ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలు!

టాలీవుడ్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, వరుస పరాజయాలతో ఆయన కెరీర్ కాస్త నెమ్మదించిన సమయంలో, దాదాపు ఏడాది పాటు సినిమాలకు విరామం ఇచ్చారు. ఆ తర్వాత ఎంతో ఆచితూచి ఎంచుకున్న కథే ‘హిట్లర్’. మలయాళంలో మమ్ముట్టి నటించిన ఈ కథను తెలుగులో ఇ.వి.వి. సత్యనారాయణ గారు డైరెక్ట్ చేశారు.

అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో పాటు చిరంజీవి మార్క్ డ్యాన్సులు, యాక్షన్ కలగలిపిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మెగాస్టార్‌కి బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చిన ఈ సినిమా వెనుక మనం ఊహించని ఎన్నో ఆసక్తికరమైన నిజాలు దాగి ఉన్నాయి. అవేంటో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.

బిగ్ బాస్,రిక్షావోడు,ఎస్పీ పరశురామ్ వంటి సినిమాలు పెద్దగా ఆడకపోవడం,మెగాస్టార్ ఫిలిం వచ్చి ఏడాది అయిపోవడంతో ఫాన్స్ లో ఒకటే ఆరాటం. చిరు పనైపోయిందన్న కామెంట్స్ వస్తుంటే అభిమానులకు తట్టుకోవడం కష్టంగా ఉంది. మరోవైపు బాలయ్య, వెంకీ, నాగ్ వంటి సాటి హీరోల సినిమాలు హిట్ మీద హిట్ కొట్టేస్తున్నాయి.

సరిగ్గా అదే టైమ్ లో ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో ఎడిటర్ మోహన్ మూవీ ప్రకటన రావడంతో ఫాన్స్ లో మళ్ళీ నిరాశ. బడ్జెట్ మూవీ కాదు,పైగా మలయాళీ మూవీకి రీమేక్. అందుకే ఇలాంటి కథ ఎంచుకున్నాడేంటని ఫాన్స్ లో ఆందోళన. పైగా టైటిల్ కూడా హిట్లర్ అని పెట్టడంతో ఫాన్స్ లో అనుమానం మరింత హెచ్చింది.

ఇలా ఫాన్స్ ఆందోళన పడుతుంటే సాంగ్స్ ఆడియో కేసెట్ రిలీజ్ అయింది. అందులో ముఖ్యంగా వేటూరి రాసిన నడక కల్సిన నవరాత్రి సాంగ్ తో ఫాన్స్ లో ఖుషి. ఈ పాటకు చిరు డాన్స్ ఎలా ఉంటుందా అని ఊహించుకోవడం మొదలు పెట్టారు. ఇక జేసుదాసు పాడినపాట కూడా బాగుంది. అప్పట్లో జేసుదాసు పాట ఉందంటే ఆ సినిమా హిట్ అనే ముద్ర కూడా బలంగా పడింది.

1997జనవరి 4న హిట్లర్ రిలీజ్. ఫైట్లు తక్కువ, ఏడుపు ఎక్కువ, సెకండాఫ్ దాసరి డామినేషన్ ఇలా డివైడ్ టాక్స్. తొలిరోజు నాలుగు ఆటలు అయ్యేసరికి సూపర్ హిట్ టాక్. సిస్టర్స్ ని ఎవరైనా ఏమైనా అంతేచాలు రఫ్ ఆడించడం,మరదలు ఎంతకవ్వించినా పెద్ద తరహాగా ఉండడం ఇవన్నీ జనానికి బాగా నచ్చాయి.

హిట్లర్ మాధవరావు గా ఆడియన్స్ కి చిరు దగ్గరయ్యాడు. హీరోయిన్ రంభ,హీరో తండ్రిగా దాసరి,బాలుగా రాజేంద్రప్రసాద్, మాధవరావు చెల్లెళ్లుగా అశ్విని,మోహిని,మీనా కుమారి,గాయత్రీ అప్పలకొండ గా బ్రహ్మానందం, సుధాకర్ ఇలా అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. దాసరితో చిరు స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక మూవీయే కాదు, ప్రకాష్ రాజ్ తో కల్సి చేసిన తొలిసినిమా కూడా ఇదే.

సెంటిమెంట్ సన్నివేశాల్లో ఎల్బీ శ్రీరామ్ రాసిన డైలాగ్స్ హృదయాన్ని తాకాయి. ఇక లారెన్స్ కొరియోగ్రాఫర్ గా కంపోజ్ చేసిన డాన్స్ కి అనుగుణంగా చిరు చేసిన డాన్స్ ఫాన్స్ ని సీట్లలో కూర్చోనీయలేదు. వారం రోజులు తిరిగేసరికి మూవీ బ్లాక్ బస్టర్. 42సెంటర్స్ లో వంద రోజులు ఆడిన ఈ మూవీ తో చిరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. అంతలా ముత్యాల సుబ్బయ్య కన్నీటి సెంటిమెంట్ పండింది.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."