పరగడుపున తీసుకుంటే…పొట్ట శుభ్రం అవ్వటమే కాకుండా పొట్టలో నొప్పి,గ్యాస్,ఎసిడిటీ, కడుపు ఉబ్బరం ఉండదు
Dhaniyalu Gas problem Home Remedies In telugu : బిజీ జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోకపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వలన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జీర్ణ సంబంద సమస్యలు అయిన గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి.

ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఒక మంచి రెమిడీ తెలుసుకుందాం. ఒక స్పూన్ ధనియాలను వేగించాలి. వేగిన ధనియాలు, చిన్న అల్లం ముక్కను కొంచెం నీటిని పోసి పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసంలో అరస్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం వేడి చేసుకొని తాగాలి.
ఈ విధంగా 3 రోజులు తాగితే జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటివి అన్నీ తొలగిపోయి ప్రశాంతగా ఉంటుంది. జీర్ణ సంబంద సమస్యలను అశ్రద్ద చేస్తే పెద్ద పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి.
ధనియాలు,అల్లం వంటింటిలో అందుబాటులో ఉంటుంది. మనం ప్రతి రోజు ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం. తేనె ఆర్గానిక్ తేనె అయితే మంచిది. ధనియాలు,అల్లం జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

