Healthhealth tips in telugu

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రక్తహీనతకు (Anemia) చెక్ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా?

cauliflower stems : ఒంట్లో రక్తం తక్కువగా ఉందా? రక్తహీనత (Anemia) సమస్యతో తరచుగా నీరసపడిపోతున్నారా? ఖరీదైన మందులు, టానిక్‌లతో పనిలేకుండా ఒక్క పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే సహజమైన ఆహారాలతో శరీరంలో రక్తాన్ని వేగంగా ఎలా పెంచుకోవాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి

క్యాలీఫ్లవర్ ని వండినప్పుడు వాటి కాడలను పాడేస్తూ ఉంటాం. వాటిలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా శరీరంలో ఐరన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య నుండి బయట పడాలంటే ఐరన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
cauliflower stem
పురుషుల్లో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 14 నుండి 16 గ్రాములు, అలాగే స్త్రీలలో 12 నుండి 14 గ్రాములు వరకు ఉండాలి. హిమోగ్లోబిన్ శాతం పెరగటానికి, రక్తకణాలు వృద్ది చెందటానికి ప్రతి రోజు సుమారుగా 30 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమవుతుంది.క్యాలీఫ్లవర్ లో కంటే కాడల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. క్యాలీఫ్లవర్ కాడల్లో ఐరన్ చాలా సమృద్దిగా ఉంటుంది.

100 గ్రాముల క్యాలీఫ్లవర్ కాడలలో దాదాపుగా 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. వీటిని కూర రూపంలో గాని, ఫ్రై రూపంలో గాని తినవచ్చు.
అలాగే పాలు పోసుకుని కూరగా చేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. వారంలో మూడు సార్లు క్యాలీఫ్లవర్ కాడలను ఆహారంలో బాగంగా చేసుకుంటే శరీరంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.

రక్తహీనత సమస్య ఉన్నప్పుడూ సాధ్యమైనంత వరకు ఆహారంలో మార్పులు చేసుకొని ఆ సమస్య నుండి బయట పడవచ్చు. రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలు అప్తించలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."