Beauty Tips

White Hair Home Remedies: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. వారానికి ఒకసారి ఇలా చేయండి..!

White Hair Home Remedies: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. వారానికి ఒకసారి ఇలా చేయండి..మారిన జీవనశైలి కారణంగా జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ రోజుల్లో తెల్లజుట్టు సమస్య చాలా ఎక్కువగా ఉంది.

అలాగే చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఇలా వాడటం వలన జుట్టు రాలే సమస్య వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంటి చిట్కాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి.

ఈ చిట్కా చేసుకోవటం చాలా సులువు. కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి తీసుకోవాలి. ఏ కంపెనీ కాఫీ పొడి అయిన పర్వాలేదు. అయితే instant coffee పొడి అయితే మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ తర్వాత రెండు స్పూన్ల hair conditioner వేయాలి.

కాఫీ పొడి,conditioner బాగా కలిసేలా బాగా కలపాలి. జుట్టును బాగా వాష్ చేసుకొని ఈ మిశ్రమాన్ని జుట్టు పైనుంచి చివర వరకు బాగా పట్టించాలి. జుట్టు పొడవుని బట్టి పేస్ట్ ని ఎక్కువగా చేసుకోవచ్చు. అరగంట అయ్యాక షాంపూ లేకుండా తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుంది.

కాఫీలో ఉండే కెఫీన్ తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది. అలాగే కాఫీ పొడి డైయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. conditioner జుట్టుకు తెమను అందించి జుట్టు ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.