ఏపీ లాక్ డౌన్ : నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరకు అమ్మితే ఈ నంబర్ కి ఫిర్యాదు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో లాక్ డౌన్ అమలు పై సమీక్ష నిర్వహించారు. అయితే ఈ నేపధ్యంలో నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను వికేంద్రీకరణ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓకే చోట కాకుండా, నగరాల్లో, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ప్రజలు మాత్రం కొనుగోలుకు వచ్చినపుడు ఒకరికి ఒకరు దూరం ఉండేలా మార్కింగ్ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరం పరిధి దాటి బయటకు రాకూడదని అన్నారు. వీటిని ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు అనుమతించాలని తెలిపారు.
అయితే పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. 144 సెక్షన్ రోజంతా అమలులో ఉండాలని తెలిపారు. అయితే కూరగాయలు, నిత్యావసర వస్తువుల రెట్లని కలెక్టర అయా జిల్లాల వారీగా టీవీలో, పేపర్ లలో ప్రకటించాలని తెలిపారు. ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే 1902 నంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. అయితే ఈ నిత్యావసరాలనీ అందిచ్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న హమాలీల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.