ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే ధోనీ కెరీర్ ముగిసినట్లేనా?

కరోనా వైరస్ కారణంగా ఎన్నో రంగాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. అయితే కరోనా వైరస్ కారణంగా ధోనీ భవితవ్యం పై చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఐపీఎల్ జరగక పోతే పరిస్తితి ఎంటి అనేది అగమ్య గోచరం గా మారింది. ధోనీ ఇక ప్రపంచ కప్ ఆడాలి అంటే ఐపీఎల్ లో ఆడాల్సిందే. కానీ ఇపుడు ఉన్న పరిస్థితుల రీత్యా ఐపీఎల్ ఈ ఏడాది కష్టమే అనిపిస్తుంది. అయితే ఇదే విషయం పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఐపీఎల్ జరగక పోతే టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ భారత జట్టులోకి రీఎంట్రీ కష్టం అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వన్డే ప్రపంచ కప్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ ఆటకి పూర్తిగా దూరమయ్యారు. అయితే ఐపీఎల్ లో సి ఎస్ కే తరపున ఆడి రాణిస్తే ధోనీ తిరిగి టీం లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇపుడు ఉన్న పరిస్థితుల రీత్యా ఇది కష్టం అని తెలుస్తోంది.ఈ టోర్నీ నిర్వహించే అవకాశం కూడా తక్కువగా నే ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు గంభీర్ ఒక క్రికెటర్ పేరు తెర పైకి తీసుకు వచ్చారు. అతనే కే ఎల్ రాహుల్. అయితే ధోనీ స్థానాన్ని కే ఎల్ రాహుల్ తో భర్తీ చేస్తే బావుంటుంది అని అన్నారు. వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మెన్ గా బాగా రాణిస్తున్నాడు అని కొనియాడారు. అయితే రాహుల్ మాత్రం ఏ స్థానంలో వచ్చినా అద్భుతంగా రాణిస్తారు అంటూ కితాబ్ ఇవ్వ్వడమే కాక, ధోనీ రిటైర్ మెంట్ తన వ్యక్తి గత విషయం అని, ఐపీఎల్ ఆడకపోతే ధోనీని సెలక్టర్లు ఏం చూసి ఎంపిక చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు.