జూన్ 21వ తేదీ అంటే ఈ రోజు (ఆదివారం) ఏడు ప్రత్యేకతలు ఉన్నాయి….అవి ఏమిటో ….?

జూన్ 21వ తేదీకి చాలా చాలా ప్రత్యేకత ఉంది. ఒక్క రోజే ఏడు ప్రత్యేక రోజులకు వేదిక కానుంది. ఒకే రోజు ఏడు‘డే’లు రానున్నాయి. వీటిల్లో ప్రపంచం నాశనమవుతుందన్న ‘డూమ్స్ డే’ కూడా ఉండటం మరో విశేషం. దీన్ని పక్కన పెడితే.. మిగతావి ఏ దినోత్సవాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రపంచ యోగా దినోత్సవం: 2015లో భారత ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన తరువాత ప్రతీ ఏడాది జూన్ 21న ‘ఇంటర్నేషనల్ యోగా డే’గా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది.

ఫాదర్స్ డే: నిజానికి ఫాదర్స్ డే ప్రతీ ఏటా జూన్ 3వ ఆదివారం నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం మూడో వారంలో ఆదివారం జూన్ 21న వచ్చింది.

షేక్ హ్యాండ్ డే: ప్రతీ ఏటా జూన్ 21న ‘షేక్ హ్యాండ్ డే’ జరుపుకుంటారు. కానీ కరోనా పుణ్యమా అని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది షేక్ హ్యాండ్ డే జరిగేలా లేదు.

వరల్డ్ మ్యూజిక్ డే: జూన్ 21న వరల్డ్ మ్యూజిక్‌ డేను కడా జరుపుకోనున్నారు. 1982లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇది ప్రారంభమయ్యింది.

వరల్డ్ హ్యుమనిస్ట్ డే: ప్రతీ యేటా జూన్ 21ని వరల్డ్ హ్యుమనిస్ట్ డే అంటే ప్రపంచ మానవత్వ దినోత్సవంగా జరుపుకుంటారు.

జల దినోత్సవం: జల దినోత్సవం దీన్నే వరల్డ్ హైడ్రోగ్రఫీ డే అని కూడా అంటారు.

టీ షర్ట్ డే: వీటన్నింతో పాటు టీ షర్ట్ దినోత్సవం కూడా జూన్ 21న జరుగుతుంది.

error: Content is protected !!