ఫోన్ లో ఆ గొంతు ఎవరిదో తెలుసా ?

ఒకప్పుడు టెలిఫోన్ అంటే కొందరికే పరిమితం. కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. పైగా స్మార్ట్ ఫోన్ రూపంలో రావడంతో అందరికీ చేతిలోకి వచ్చేసింది. ఈ ప్రపంచమే ఆ ఒక్క ఫోన్ లో లాక్ అయింది. అంతలా ఫోన్ తో మనకి బంధం ఏర్పడిపోయింది. నిత్యావసరం అయింది.

అయితే వీడియోకాల్స్,మామూలు కాల్స్ , చాటింగ్ ఇలా ఎన్నో ఈ స్మార్ట్ ఫోన్ తెచ్చిపెట్టడంతో ఎప్పుడు ఎవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడేయవచ్చు. కానీ ఒక్కోసారి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని,దయచేసి కాసేపు ఆగిచేయండి, మీరు ఫోన్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో ఉన్నారు ఇలా వినిపిస్తూ ఉంటుందని తెలుసు కదా.

అయితే ఇలా మాట్లాడే అపరిచిత గొంతు ఎవరిదో తెలుసా ? ఈమె పేరు మేఘన ఎర్నాడే. ఈమె మరాఠీ కి చెందిన మిమిక్రి తెల్సిన మహిళ. ఇంగ్లీషు,హిందీలలో ఎన్నో డబ్బింగ్స్ చెప్పిన ఈమె ఎన్నో కార్టూన్ ప్రోగ్రామ్స్ కి వాయిస్ అందించారు.

error: Content is protected !!