ఆడు మామా.. ఆడు..,బంతి ను తోమాలంటే మన తెలుగు వాళ్ళే..గవాస్కర్ ను మించి..

Hanuma vihari :సిడ్నీ టెస్ట్ డ్రా గా ముగియడానికి కారణమైన హనుమ విహారి మన తెలుగు వాడే.. ఇంతకు ముందు ఆస్ట్రేలియా లో ఇలాంటి ప్రదర్శనే చేసి తరువాత ఆస్ట్రేలియా కు సింహస్వప్నం గా మారిన వి వి ఎస్ లక్ష్మణ్ కూడా మన తెలుగు వాడే.

అశ్విన్ తో కలసి హనుమ విహారి ఆడిన ఆట చిరస్మరణీయం. ఆడుతున్నంత సేపు.. అశ్విన్ ఎంతో తోడ్పాటు నిచ్చాడు హనుమ విహారి కు. అశ్విన్ తెలుగు లో.. విహారి ను.. ఆడు మామా.. ఆడు.. అని ప్రోత్సహించడం స్టంప్స్ మైక్ నుండి ప్రేక్షకులకు కూడా వినబడింది.