ఇండియన్ క్రికెట్ లో మరో మహ్మద్ అజహరుద్దీన్ .. అంతకుమించి..

kerala opener mohammad azharuddin :దేశవాళీ క్రికెట్ T20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నీ లో భాగంగా ముంబయి తో జరిగిన మ్యాచ్ లో కేరళ బ్యాట్స్ మ్యాన్ మహ్మద్ అజహరుద్దీన్ భారత్ తరపున T20 లో రెండో వేగవంతమైన సెంచరీ చేశాడు. 137 నాటౌట్ గా ఉన్న అతను కేవలం 37బంతులలోనే సెంచరీ పూర్తి చేశాడు. దెబ్బకు overnight star అయిపోయాడు.

ఇతనికీ పేరు వెనుక ఒక కథ ఉంది. కథ కాదు.. అన్న ఉన్నాడు. ఇతని అన్న అప్పట్లో ఇండియన్ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కు వీరాభిమాని. దాంతో తమ్ముడికి ఆ పేరే పెట్టాలి అని మంకుపట్టు పట్టి, నామకరణ సమయం లో తమ్ముడికి మహ్మద్ అజహరుద్దీన్ పేరు ఖాయమయ్యేలా చేశాడు.

ముంబయి పై కేరళ జట్టు విజయానంతరం ఈ మ్యాచ్ చూసిన వీరేంద్ర సెహ్వాగ్ మహ్మద్ అజహరుద్దీన్ ఆటతీరు ను ఆకాశానికెత్తేశాడు.