Healthhealth tips in telugu

ఒక్క చుక్క నూనె రాస్తే చాలు…కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు, నడుమునొప్పి అనేవి జీవితంలో అసలు ఉండవు

Joint Pains Oil In Telugu : ఈ మధ్య కాలంలో చాలా మంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మరియు ఇతర నొప్పులను తగ్గించుకోవటానికి ఒక మంచి నూనెను తయారుచేసుకుందాం. ఇంటిలో తయారుచేసుకొనే నూనెలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ నూనె కోసం 2 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
ginger tea benefits
ఈ నూనెను తయారుచేసుకోవటం చాలా సులభం. ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ నూనె తయారీ కోసం ముందుగా అల్లంను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురమాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి 50 గ్రాముల నువ్వుల నూనెను పోసి దానిలో తురిమిన అల్లంను ఒక స్పూన్ మోతాదులో వేయాలి.

ఈ మిశ్రమాన్ని 7 నిమిషాల పాటు వెగించాలి. అప్పుడే అల్లంలో ఉన్న పోషకాలు అన్నీ నూనెలోకి చేరతాయి. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ నూనెను ఉపయోగించిన ప్రతిసారి గోరువెచ్చగా చేసుకోవాలి. ఈ నూనె నొప్పులను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది.

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ,లక్షణాలు ఉండుట వలన మోకాళ్ళ నొప్పి,కీళ్ల నొప్పి వంటి అన్నీ రకాల నోపులను తగ్గిస్తుంది.ఇది కీళ్ల చుట్టూ మంట మరియు నొప్పిని తగ్గిస్తుంది. నువ్వుల నూనెలో జింక్, కాల్షియం మరియు భాస్వరం వంటివి సమృద్దిగా ఉండుట వలన ఎముకలను బలోపేతం చేయడంలో మరియు మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది.