Healthhealth tips in telugu

వీటిని తింటే జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు లేకుండా చేస్తుంది

Foods to boost brain : మన శరీరానికి శక్తి ఎంత అవసరమో మెదడు ఆరోగ్యంగా,పనితీరు బాగుండేలా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.ఇలాంటి ఆహారాలను తీసుకుంటూ ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవాలి. మనం తీసుకొనే ఆహారం మెదడు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేసి మతిమరుపు లేకుండా చేస్తుంది.
coffee and cinnamon benefits
మనలో చాలా మందికీ ఉదయం లేవగానే కాఫీ తాగటం అలవాటు. కాఫీ లేనిదే అసలు తోచదు. కాఫీ చురుకుదనం మరియు మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది. కెఫీన్ మరియు యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన అల్జీమర్స్ నుండి కొంత రక్షణను కూడా అందిస్తుంది.జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
weight loss tips in telugu
పసుపు జ్ఞాపకశక్తిని పెంచి మెదడు చురుగ్గా ఉండేలా చేయటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అల్జీమర్స్ ఉన్నవారిలో పసుపులో ఉండే కర్కుమిన్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాక ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం అయిన అమిలాయిడ్ ఫలకాలను క్లియర్ చేయడంలో కూడా సహాయపడుతుంది.
saraswati Plant
కొత్త మెదడు కణాలు పెరగడానికి సహాయపడుతుంది. కర్కుమిన్ మెదడు-ఉత్పన్నమైన న్యూరోట్రోఫిక్ కారకాన్ని పెంచుతుంది, మెదడు కణాల పెరుగుదలకు సహాయపడే ఒక రకమైన గ్రోత్ హార్మోన్. ఇది వయస్సు-సంబంధిత మానసిక క్షీణతను ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. డిప్రెషన్‌ను కూడా తగ్గిస్తుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో పావుస్పూన్ పసుపు కలిపి వారంలో 3 రోజులు తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.