Kitchenvantalu

పిల్లల మెదడు చురుగ్గా ఉండేలా చేసి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు లేకుండా చేస్తుంది

Brain Foods for Children : పిల్లల బ్రెయిన్ షార్ప్ గా పని చేయాలంటే పోషకాహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. మంచి ఆహారం పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పిల్లల మెదడు పనితీరును మెరుగుపరిచే స్మూతీ గురించి తెలుసుకుందాం.
gummadi ginjalu benefits in telugu
రాత్రి సమయంలో ఒక బౌల్ లో ఒక స్పూన్ గుమ్మడి గింజలు, ఒక స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, ఒక స్పూన్ పుచ్చ గింజలు వేసి నీటిని పోసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం ఒక అరటిపండు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.ఆ తర్వాత బ్లెండ‌ర్‌ తీసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు వేయాలి.
Sun Flower seeds Benefits in telugu
ఆ తర్వాత నానబెట్టుకున్న గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, అర కప్పు పాలకూర, ఒక స్పూన్ అవిసె గింజలు, రెండు స్పూన్ల పీన‌ట్‌ బటర్,ఒక గ్లాస్ ఆల్మండ్ మిల్క్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన ఎన్నో పోషకాలు ఉన్న స్మూతీ రెడీ అయినట్టే.
Watermelon seeds Benefits in telugu
ఈ స్మూతీని ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఇస్తే పిల్లల మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు లేకుండా చేస్తుంది. అంతేకాక అలసట,నీరసం వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ గా వచ్చే సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి.

ఎముకలు, కండరాలు దృఢంగా ఉంటాయి. ఈ స్మూతీకి ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి కాస్త ఓపికగా పిల్లలకు ఇస్తే చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. పెరిగే పిల్లలకు అన్నీ పోషకాలు సమృద్దిగా అందేలా చూసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.