Healthhealth tips in telugu

వెయిట్ లాస్, హెయిర్ గ్రోత్ మరియు బ్రెయిన్ పవర్ కోసం అద్భుతమైన ప్రోటీన్ లడ్డు

protein laddu Health benefits In telugu : బరువు తగ్గడం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు.. ఇలా అనేక సమస్యలకు ఒకే ఒక రుచికరమైన పరిష్కారం ఈ మ్యాజిక్ లడ్డు! రోజుకు ఒక్క లడ్డు తింటే చాలు, మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడంతో పాటు మీ ఎముకలు ఉక్కులా తయారవుతాయి.

అంతేకాదు, మీ జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా రెట్టింపు అవుతుంది. ఈ సూపర్ హెల్తీ లడ్డు ఎలా తయారు చేయాలో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి.

ఈ రోజుల్లో సమస్యలు వస్తే తొందరగా తగ్గటం లేదు. అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం ఇంటిలోనే పరిష్కారం చేసుకోవచ్చు. కాస్త శ్రద్ద పెడితే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కాబట్టి అధిక బరువు సమస్య తగ్గటానికి, ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండటానికి, జుట్టు రాలే సమస్య తగ్గటానికి ఒక లడ్డు గురించి తెలుసుకుందాం.
Peanuts Health benefits in telugu
దీని కోసం పాన్ పెట్టి ఒక కప్పు ఆవిసే గింజలను వేగించుకోవాలి. ఆ తర్వాత అరకప్పు వేరుశనగ గుళ్లను వేగించుకోవాలి. ఆ తర్వాత అరకప్పు నువ్వులను వేగించుకోవాలి. బాగా వేగిన ఆవిసే గింజలు, నువ్వులు, వేరుశనగ గుళ్లను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.

ఇప్పుడు బెల్లంను తీగ పాకం పట్టి దానిలో ఆవిసే గింజలు,నువ్వులు,వేరుశనగ గుళ్ళ పొడిని వేసి బాగా కలిపి లడ్డులుగా చేసుకోవాలి. ఈ లడ్డులు దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రతి రోజు ఒక లడ్డు తినవచ్చు.

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు. ఈ లడ్డు తినటం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎముకలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి ఉండవు. అంతేకాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు కూడా ఉండవు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."