Beauty Tips

బీట్ రూట్ తో ఇలా చేస్తే మెరిసే ముఖం మీ సొంతం

బీట్ రూట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బీట్ రూట్ లో ఎన్నో పోషకాలుఉన్నాయి . అందువల్ల పోషకాహార నిపుణులు బీట్ రూట్ ని రెగ్యులర్ గా తినమని చెప్పుతూ ఉంటారు. బీట్ రూట్ ఆరోగ్యానికే కాకుండా అందాన్ని రెట్టింపు చేయటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బీట్ రూట్ ని ఎలా వాడితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం. బీట్ రూట్ పేస్ట్ లో పాలను కలపాలి

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం క్లీన్‌ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది.బీట్ రూట్ రసం మరియు షుగర్ రెండింటి క‌లిపి ముఖానికి స్క్ర‌బ్ చేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటె బ్లాక్ హెడ్స్,నల్లని మచ్చలు తొలగిపోతాయి.