Healthhealth tips in telugu

శనగలు, ఎండుద్రాక్ష కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా…అసలు నమ్మలేరు

chickpeas and raisins Benefits in Telugu: శనగలు,ఎండుద్రాక్ష లలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెడింటిని కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి సమయంలో ఒక స్పూన్ శనగలు, 5 లేదా 6 ఎండు ద్రాక్షను నీటిలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన శనగలు,ఎండు ద్రాక్ష తింటూ ఆ నీటిని తాగాలి.

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారు వీటిని 15 రోజుల పాటు తింటే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య అనేది అసలు ఉండదు. అలసట,నీరసం అనేవి కూడా ఉండవు. ముఖ్యంగా వేసవికాలంలో ప్రతి రోజు తినటం వలన మంచి ప్రయోజనం కనపడుతుంది.

ఈ రెండింటిలోను యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన పొట్టకు సంబందించిన గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. అయితే లిమిట్ గా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.