Beauty Tips

Curry Leaves For Hair :జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే కరివేపాకును ఇలా వాడితే మీ జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా పెరుగుతుంది

Curry Leaves For Hair :జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే కరివేపాకును ఇలా వాడితే మీ జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా పెరుగుతుంది..ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది ఒక సాధారణమైన సమస్యగా మారిపోయింది.

తీసుకునే ఆహారం, వర్క్ టెన్షన్లు, విశ్రాంతి లేకపోవడం ఇలా ఎన్నో కారణాలు జుట్టు ఊడిపోయేలా చేస్తున్నాయి. జుట్టు రాలటం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరిలో ఆందోళన, టెన్షన్ ప్రారంభం అవుతుంది.సాధారణంగా ఆడవాళ్లైనా, మగవాళ్లైనా రోజూ 50 నుంచీ 100 వెంట్రుకలు రాలిపోతాయి.

జుట్టు రాలకుండా ఉండటానికి ఏమి చేయాలా అని తెగ ఆలోచిస్తూ మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ఉత్పత్తులను కొని వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు. అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే మన ఇంటి చిట్కాలు అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలె సమస్య నుండి బయట పడవచ్చు.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల కరివేపాకు పొడి, ఒక స్పూన్ ఉసిరి పొడి, రెండు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

పెరుగును జుట్టు సంరక్షణలో పురాతన కాలంనుండి వాడుతున్నారు. పెరుగులో ఉన్న పోషకాలు జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సాహం ఇస్తాయి. అలాగే జుట్టు రాలడానికి కారణం అయినా చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. జుట్టుకు మెరుపునుఇస్తుంది . పెరుగు ఒక కండిషనర్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.