Illu Illaalu Pillalu Vedhavathii:’ఇల్లు ఇల్లాలు పిల్లలు’ వేదవతి (ఆమని) ఆస్తులు, రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Illu Illaalu Pillalu Vedhavathii:’ఇల్లు ఇల్లాలు పిల్లలు’ వేదవతి (ఆమని) ఆస్తులు, రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రేటింగ్స్ వస్తున్నాయి. ఇందులో రామరాజుకు తోడుగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే ‘వేదవతి’ పాత్రలో నటిస్తున్న సీనియర్ హీరోయిన్ ఆమని తన నటనతో బుల్లితెర ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నారు.
ఒకప్పుడు అగ్ర హీరోల సరసన బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం, ఎదుర్కొన్న కష్టాలు, ప్రస్తుత ఆస్తులు మరియు రెమ్యూనరేషన్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ గూగుల్ చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
భర్తకు దూరం.. ఒంటరి పోరాటం!
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఓ తమిళ నిర్మాతను పెళ్లి చేసుకున్నారు ఆమని. కొన్నాళ్ల పాటు వీరి జీవితం సంతోషంగానే సాగినా.. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో భారీగా నష్టపోయి దివాలా తీశారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో భర్తకు దూరంగా ఉంటున్నారు. తన పిల్లల భవిష్యత్తు కోసం ఒంటరిగా బాధ్యతలు భుజాన వేసుకుని, మళ్లీ ముఖానికి రంగేసుకుని కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు.
రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారంటే?
సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమని.. తన నటనతో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆమె ఒక్కో సీరియల్ ఎపిసోడ్‌కు సుమారు రూ. 35,000కు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. తెలుగు, తమిళ సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఆమని ఆస్తుల వివరాలు ఇవే..
ఆమె ఆస్తుల విలువపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం..ఆమనికి చెన్నైలో అత్యంత ఖరీదైన సొంత ఇల్లు ఉంది.భర్త తరపు నుంచి వచ్చిన కొన్ని ఆస్తులతో పాటు, కుటుంబం ద్వారా సంక్రమించిన ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.
వీటికి తోడు ఆమె వద్ద భారీగా బంగారు ఆభరణాలు, ఖరీదైన పట్టుచీరల కలెక్షన్ కూడా ఉంది.ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా.. తన పిల్లల కోసం నిలబడి ఒంటరిగా పోరాడుతున్న ఆమని ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

