Brahmamudi Rudraani : స్టార్ మా ‘బ్రహ్మముడి’ రుద్రాణి రియల్ లైఫ్: బికినీలో గ్లామర్ షో.. ఆస్తులు, రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
Brahmamudi Rudraani : స్టార్ మా ‘బ్రహ్మముడి’ రుద్రాణి రియల్ లైఫ్: బికినీలో గ్లామర్ షో.. ఆస్తులు, రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే..స్టార్ మా (Star Maa) లో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్ లో ‘బ్రహ్మముడి’ ఒకటి. ఎన్నో మలుపులతో సాగుతున్న ఈ సీరియల్లో తన విలనిజంతో, పొగరుతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న క్యారెక్టర్ ‘రుద్రాణి’. సీరియల్లో ఈమె నటన చూసి జనాలు ‘రుద్రాణి కాదు.. క్షుద్రాణి’ అని ముద్దుగా తిట్టుకునేంతలా ఆమె తన క్యారెక్టర్లో జీవిస్తోంది.
పెద్ద వయసున్న అత్త పాత్రలో కనిపిస్తున్న ఈ అందమైన విలన్ రియల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఆమె ఆస్తులు, రెమ్యూనరేషన్ ఎంత? అని తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో చూద్దాం..
అసలు ఈ రుద్రాణి ఎవరు?
రుద్రాణి అసలు పేరు షర్మిత గౌడ (Sharmitha Gowda). ఈ కన్నడ బ్యూటీ, కన్నడ టీవీ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బ్రహ్మముడి’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చూడ్డానికి చాలా యంగ్‌గా ఉన్నప్పటికీ, అత్త పాత్రలో మెచ్యూర్డ్‌గా నటిస్తూ జేజేలు అందుకుంటోంది.
చీరలో విలన్.. బయట గ్లామర్ క్వీన్!
సీరియల్లో ఎప్పుడూ పద్ధతిగా నిండుగా చీరకట్టులో కనిపించే షర్మిత.. రియల్ లైఫ్‌లో మాత్రం కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది.పిల్లలు ఉన్నా సరే చెక్కు చెదరని ఫిట్నెస్తో ఆకట్టుకునే షర్మిత.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.ట్రెండీ వేర్స్‌తో పాటు, బికినీలో ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. టీవీలో చూసిన రుద్రాణికి, రియల్ లైఫ్‌లో ఉన్న షర్మితకు ఉన్న తేడా చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ఆస్తులు, బిజినెస్ ఏ రేంజ్లో ఉన్నాయంటే?
విలన్ గానే కాదు, రియల్ లైఫ్‌లో కూడా షర్మిత బాగానే సెటిల్ అయ్యారు. ఆమె ఆస్తుల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.కర్ణాటకలో ఈమెకు ఒక విలాసవంతమైన పెద్ద బంగ్లాతో పాటు లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం.నటనతో పాటు ఆమె ఒక సొంత ‘బ్యూటీ పార్లర్’ బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు.మొత్తంగా ఆమె ఆస్తుల విలువ కోట్లల్లోనే ఉంటుందని టాక్.
ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతంటే?
తెలుగు టీవీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో షర్మిత ఒకరు. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘బ్రహ్మముడి’ సీరియల్ కోసం ఆమె ఒక్క రోజుకు దాదాపు రూ. 50,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె నెల ఆదాయం అక్షరాలా లక్షల్లోనే ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

