Tamarind Storage: అమ్మమ్మల నాటి అద్భుత చిట్కా.. ఇలా చేస్తే చింతపండు సంవత్సరమైనా పాడవ్వదు, నల్లబడదు!
భారతీయ వంటగదిలో చింతపండు (Tamarind) లేనిదే ఏ పనీ జరగదు. పులిహోర, సాంబార్, రసం, చికెన్ పులుసు.. ఇలా ఏది చేయాలన్నా చింతపండు పడాల్సిందే.
అందుకే మన వాళ్లు ఏడాదంతా సరిపడేలా ఒకేసారి చింతపండును కొని నిల్వ చేసుకుంటారు. కానీ, కొద్ది రోజులకే అది నల్లగా మారిపోవడం, బూజు పట్టడం లేదా పురుగులు చేరడం చూస్తుంటాం.
అయితే, మన అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఫ్రిజ్‌లు లేకపోయినా చింతపండును ఏళ్ల తరబడి ఫ్రెష్‌గా నిల్వ చేసేవారు. అప్పట్లో చింతపండు రంగు, రుచి ఏమాత్రం మారేది కాదు. వారు పాటించిన ఆ సీక్రెట్ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చింతపండు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి:
1. శుభ్రం చేయడం ముఖ్యం:
ముందుగా మార్కెట్ నుంచి తెచ్చిన చింతపండులోని గింజలు, ఈనెలు, పెంకులు, చెత్తను పూర్తిగా ఏరివేయాలి. గింజలు ఉంటే చింతపండు త్వరగా పాడైపోయి, బూజు పడుతుంది.
2. ఎండలో ఆరబెట్టాలి:
శుభ్రం చేసిన చింతపండును కనీసం రెండు రోజుల పాటు మంచి ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే తేమ (Moisture) పూర్తిగా పోయి, పురుగు పట్టకుండా ఉంటుంది.

3. అసలైన సీక్రెట్ ‘కల్లుప్పు’:
చింతపండును నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలను కాకుండా.. మట్టి జాడీ లేదా గాజు సీసాను ఎంచుకోండి. డబ్బా అడుగు భాగంలో కొద్దిగా కల్లుప్పు (Crystal Salt) చల్లాలి. ఆ పైన కొంచెం చింతపండు పెట్టి, మళ్లీ కల్లుప్పు చల్లాలి.
ఇలా లేయర్లు లేయర్లుగా వేస్తూ డబ్బాను నింపాలి. చివరగా పైన కొద్దిగా కల్లుప్పు వేసి గాలి చొరబడకుండా మూత గట్టిగా పెట్టాలి. ఉప్పు అనేది సహజమైన ప్రిజర్వేటివ్‌గా పనిచేసి చింతపండును పాడవకుండా కాపాడుతుంది.

4. పసుపు, ఆముదం వాడకం:
కొంతమంది చింతపండును ఉండలుగా చేసేటప్పుడు చేతులకి కొద్దిగా ఆముదం (Castor oil) లేదా పసుపు రాసుకుని, చింతపండుకు పట్టిస్తూ జాడీల్లో పెడుతుంటారు.
ఇది కూడా వందల ఏళ్లుగా వస్తున్న అద్భుతమైన పద్ధతి. దీనివల్ల చింతపండు సంవత్సరం కాదు కదా.. రెండేళ్లయినా ఎర్రగా, ఫ్రెష్‌గా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ఈ తప్పులు అస్సలు చేయకండి:
చింతపండు తీసేటప్పుడు ఎప్పుడూ తడి చేతులు పెట్టకూడదు. పొడిగా ఉన్న చెక్క స్పూన్‌ను వాడటం ఉత్తమం.
గాలి, తేమ, వెలుతురు ఎక్కువగా తగిలే చోట కాకుండా, కొద్దిగా చీకటిగా, పొడిగా ఉండే ప్రదేశంలో (Dry place) చింతపండు జాడీని ఉంచాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

