లంచ్ బాక్స్ టెన్షనా? ఇలా ‘ఆలూ మేతీ పరాటా’ చేసి ఇవ్వండి.. ఒక్క ముక్క కూడా మిగల్చకుండా కంప్లీట్ చేస్తారు!
రోజూ లంచ్ బాక్స్‌లోకి ఏం వండాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? రోజూ అన్నం తిని బోర్ కొట్టిందా? అయితే రైస్‌కి పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ ఈ ‘ఆలూ మేతీ పరాటా’ (Aloo Methi Paratha).
ఒక్క పరాటా తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది. మెంతికూరలోని పోషకాలు, ఆలూలోని రుచి కలిసి.. పిల్లలైనా, పెద్దలైనా లొట్టలేసుకుని తినాల్సిందే.
ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అందించే ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు ఇవే:
గోధుమ పిండి: 2 కప్పులు
మెంతి కూర ఆకు తరుగు: 1 కప్పు (సన్నగా తరిగినది)
ఉడికించిన ఆలూ (బంగాళదుంపలు): 2
పచ్చిమిర్చి తురుము: 2
వాము: ¼ టీ స్పూన్ (చేత్తో నలిపి వేయాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 1 టేబుల్ స్పూన్ (పిండిలో కలపడానికి)
నూనె లేదా నెయ్యి: 4 టేబుల్ స్పూన్స్ (పరాటాలు కాల్చుకోవడానికి)

తయారీ విధానం.. చాలా సింపుల్!
ముందుగా మెత్తగా ఉడికించిన బంగాళదుంపలను, వెల్లుల్లి రెబ్బలను మెత్తగా తురుముకుని ఒక బౌల్‌లో పెట్టుకోవాలి.
ఆ బౌల్‌లో గోధుమ పిండి, మెంతికూర తరుగు, పచ్చిమిర్చి, వాము, కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. ముందుగా నీళ్లు పోయకుండా, ఆలూలోని తేమతోనే పిండిని గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. (అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లండి).
ఇప్పుడు పిండిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మరో నిమిషం పాటు బాగా వత్తి.. కనీసం అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
నానిన పిండిని పెద్ద పెద్ద ముద్దలుగా తీసుకుని చపాతీ కర్రతో పల్చగా ఒత్తుకోవాలి. దానిపై కాస్త నూనె రాసి, సమోసా ఆకారంలో (త్రిభుజాకారం) మడతపెట్టి మళ్లీ సమానంగా ఒత్తుకోవాలి.

స్టవ్ మీద పెనం (Tawa) పెట్టి వేడయ్యాక.. ఈ పరాటాను వేసి రెండు వైపులా నూనె లేదా నెయ్యి రాస్తూ ఎర్రగా, దోరగా కాల్చుకోవాలి.
ఇవి కూడా చదవండి:
అంతే! ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ‘ఆలూ మేతీ పరాటా’ రెడీ.
రుచి చిట్కా: ఈ వేడి వేడి పరాటాలను చల్లటి పెరుగు లేదా మీకు ఇష్టమైన పచ్చడితో (Pickle) సర్వ్ చేస్తే.. టేస్ట్ అదుర్స్ అనాల్సిందే! ఇంకెందుకు ఆలస్యం, రేపటి మీ లంచ్ బాక్స్ మెనూలో దీన్ని యాడ్ చేసేయండి.

